Kalvakuntla Kavitha: సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టిన కవిత... కొన్ని బంధాలు ప్రత్యేకమన్న కేటీఆర్

Kalvakuntla Kavitha ties Rakhi to her brother KTR
  • ప్రగతి భవన్ లో రక్షా బంధన్ వేడుకలు
  • హాజరైన కల్వకుంట్ల కవిత
  • కేటీఆర్ నుంచి ఆశీస్సులు అందుకున్న కవిత
  • రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు
దేశవ్యాప్తంగా రక్షా బంధన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. కొందరు నిన్న (ఆగస్టు 11) రాఖీ పండుగ జరుపుకోగా, ఇవాళ కూడా కొందరు తమ తోబుట్టువులకు రాఖీ కట్టి ఆశీస్సులు అందుకుంటున్నారు.

తాజాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు, మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కవిత కూడా పాల్గొన్నారు. తన సోదరుడికి రాఖీ కట్టి దీవెనలు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 

కాగా, రక్షా బంధన్ ను పురస్కరించుకుని కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. కొన్ని బంధాలు చాలా ప్రత్యేకం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన సోదరి కవితతో చిన్నప్పటి ఫొటోను, తన కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్య కలిసున్న ఫొటోను కూడా కేటీఆర్ పంచుకున్నారు.
Kalvakuntla Kavitha
KTR
Rakhi
Rakshabandhan
TRS
Telangana

More Telugu News