వరదల్లో కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులో రూ. 24 లక్షలు!
- వరదల కారణంగా ఉప్పొంగిన కుమోలో నది
- పురోలా పట్టణంలో నదిలో కొట్టుకుపోయిన దుకాణాలు
- కొట్టుకుపోయిన ఏటీఎంలో ఎంత మిగిలిందన్న దానిపై అధికారుల లెక్కలు
పురోలా పట్టణంలో నది ఒడ్డున ఉన్న 8 దుకాణాలు నదిలో కొట్టుకుపోయాయి. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఏటీఎం కూడా ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. అంతకుముందే అందులో రూ. 24 లక్షలు నగదు ఉంచినట్టు చెప్పారు. ఏటీఎం నదిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.