Tollywood: గుజ‌రాతీ థాలి ప్లేట్ ముందు విజ‌య్ దేవ‌ర‌కొండ‌... ఫొటో ఇదిగో

  • లైగ‌ర్ ప్ర‌మోష‌న్స్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌
  • ప్ర‌స్తుతం గుజ‌రాత్‌లో ప‌ర్య‌టిస్తున్న హీరో
  • గుజ‌రాతీ థాలి వంట‌కాల‌ను ప‌రిశీలిస్తున్న విజ‌య్‌
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఫొటో
a photo of vijay devarakonda sits be3fore gujarati taali plate goes viral on social media

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న తాజా చిత్రం లైగ‌ర్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా గుజ‌రాత్‌లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆ రాష్ట్రంలో జ‌రిగిన సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న విజ‌య్‌... స్థానిక ఆహారం గుజ‌రాతీ థాలి ప్లేట్ ముందు కూర్చుని దానిని ఆర‌గించేందుకు సిద్ధ‌ప‌డుతున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫొటోను విజ‌య్ స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

గుజ‌రాతీ స్థానిక వంట‌కాల‌తో కూడిన స‌ద‌రు ప్లేట్‌లో ప‌లు ర‌కాల వంట‌కాల‌ను పెద్ద ప్లేట్‌లో అమ‌ర్చారు. ఆ ప్లేట్‌లోని ఆహార ప‌దార్థాల‌ను ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ విజ‌య్ కూర్చుని ఉన్నాడు. ఈ ఫొటోపై కామెంట్లు చేస్తూ పెద్ద సంఖ్య‌లో నెటిజ‌న్లు ఆ ఫొటోను వైర‌ల్ చేస్తున్నారు. టాలీవుడ్ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

More Telugu News