Vice President Of India: పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో సీతా అశోక మొక్క‌ను నాటిన వెంక‌య్య‌

  • నేడే ఉప‌రాష్ట్రప‌తిగా దిగిపోనున్న వెంక‌య్య‌
  • రేపు ఉప‌రాష్ట్రప‌తిగా ప్ర‌మాణం చేయ‌నున్న జ‌గ‌దీప్‌
  • సాంస్కృతికంగానే కాకుండా ఔష‌ధ గుణాలున్న మొక్క‌గా సీతా అశోక‌కు గుర్తింపు
vice president venkaiah naidu plants Sita Ashoka sappling in parliament premises

తెలుగు నేల‌కు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు బుధ‌వారం భార‌త ఉప‌రాష్ట్రప‌తి ప‌ద‌వి నుంచి వైదొల‌గ‌నున్నారు. వెంక‌య్య స్థానంలో కొత్త ఉప‌రాష్ట్రప‌తిగా ఎన్నికైన జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ఢ్ గురువారం ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. 

ఈ క్ర‌మంలో బుధ‌వారం వెంక‌య్య‌నాయుడు పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో సీతా అశోక మొక్క‌ను నాటారు. భార‌తీయ సంస్కృతిలో ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న సీతా అశోక మొక్కకు ఔష‌ధ గుణాలున్న చెట్టుగానూ గుర్తింపు ఉంది. రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌వి నుంచి దిగిపోతున్న నేప‌థ్యంలోనే వెంక‌య్య అరుదైన ఈ మొక్క‌ను పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో నాటారు.

More Telugu News