Chandrababu: చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై వైసీపీ ఉలికిపాటు: పయ్యావుల కేశవ్

Payyavula kesav said YSRCP Shivers on Chandrababu Delhi tour
  • చంద్రబాబు పర్యటనతో ఢిల్లీలో వైసీపీ అసత్య ప్రచారాలు కొట్టుకుపోయాయన్న టీడీపీ నేత
  •  ద్రౌపది ముర్ము ఓ తల్లిలా తమతో మాట్లాడారన్న పయ్యావుల
  • ఢిల్లీలో అన్ని పార్టీల నేతల నుంచి చంద్రబాబుకు సాదర స్వాగతం లభించిందన్న నేత
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి ఢిల్లీ పర్యటనపై వైసీపీ ఉలిక్కిపడుతోందని టీడీపీ నేత, ఏపీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. ఢిల్లీలో వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలు చంద్రబాబు పర్యటనతో కొట్టుకుపోయాయన్నారు. సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. చంద్రబాబుకు సూచించారని పయ్యావుల అన్నారు. 

ఢిల్లీలోని అన్ని పార్టీల నేతలతోపాటు ప్రభుత్వ పెద్దలు కూడా చంద్రబాబును సాదరంగా స్వాగతించారన్నారు. ద్రౌపది ముర్మును కలిసిన తర్వాత రాష్ట్రపతిగా ఆమె ఎంపిక సరైనదేనని అనిపించిందన్నారు. ఆమెతో భేటీ అద్భుతంగా జరిగిందని, ఓ తల్లిలా తమతో మాట్లాడారని కేశవ్ అన్నారు.
Chandrababu
Delhi Tour
YSRCP
Payyavula Keshav

More Telugu News