BC Ministry: కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలంటూ వైసీపీ ఎంపీల ధర్నా

YCP MPs demands BC Ministry in Center
  • ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో ధర్నా
  • ధర్నాలో పాల్గొన్న మార్గాని భరత్, బీద మస్తాన్ రావు
  • టీడీపీపై భరత్ విమర్శలు
వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎంపీలు మార్గాని భరత్, బీద మస్తాన్ రావు ధర్నాకు దిగారు. 

కాగా, మార్గాని భరత్ మాట్లాడుతూ టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పోలవరం నిధులు దుర్వినియోగం జరగలేదని కేంద్రం స్పష్టం చేసిందని వెల్లడించారు. నిధులు రాకుండా చూడాలని టీడీపీ ఎంపీలు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే పోలవరం ఆలస్యం అయిందని అన్నారు. టీడీపీ చర్యలు రాష్ట్రానికి అన్యాయం చేసేవిధంగా ఉన్నాయని విమర్శించారు. టీడీపీ నేతలకు రాష్ట్ర ప్రజల కంటే రాజకీయాలే ముఖ్యమయ్యాయని వ్యాఖ్యానించారు.
BC Ministry
YCP
New Delhi
Center

More Telugu News