Nara Lokesh: మహిళలు ఫిర్యాదు చేస్తేనే చర్యలు అంటున్నారు సకల శాఖ మంత్రి సజ్జల: నారా లోకేశ్

Nara Lokesh fires on Sajjala
  • సత్యసాయి జిల్లాలో మహిళపై ముగ్గురు అత్యాచారం చేశారన్న లోకేశ్ 
  • పోలీసులు తగాదా కేసు పెట్టి, చేతులు దులుపుకున్నారని విమర్శ 
  • బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ 
మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. పైగా మహిళలు ఫిర్యాదు చేస్తేనే చర్యలు అని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారని విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారని... బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు అత్యాచారం కేసు నమోదు చెయ్యకుండా, తగాదా కేసు పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. 

స్థానిక వైసీపీ నేతల ఒత్తిడితో పోలీసులు కేసు తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారని ఆయన అన్నారు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ సోమశేఖర్, అఖిల్, అక్కులప్ప, వారికి సహకరిస్తున్న స్థానిక వైసీపీ నేతలను తక్షణమే అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Sajjala Ramakrishna Reddy
YSRCP

More Telugu News