తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న కరోనా రోజువారీ కేసులు
- గత 24 గంటల్లో 33,455 కరోనా పరీక్షలు
- 528 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 196 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 771 మంది
- ఇంకా 5,667 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,26,284 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,16,506 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,667 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది కరోనాతో మృతి చెందారు.
