JEE Main: జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల... సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

JEE Main results released
  • ఫలితాలు వెల్లడించిన ఎన్టీయే
  • 24 మందికి నూటికి నూరు మార్కులు
  • వారిలో 10 మంది తెలుగు రాష్ట్రాల వారే!
  • టాప్-10లో ముగ్గురు తెలుగు విద్యార్థులు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నేడు జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల చేసింది. జేఈఈ మెయిన్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ లో 24 మంది అభ్యర్థులు 100 ఎన్టీఏ స్కోరు తెచ్చుకున్నారు. వారిలో అత్యధికంగా ఏపీకి చెందిన వారు ఐదుగురు, తెలంగాణకు చెందినవారు ఐదుగురు, రాజస్థాన్ కు చెందినవారు నలుగురు ఉన్నారు. 

తెలుగు విద్యార్థులు పి.రవిశంకర్ (6వ ర్యాంకు), హిమవంశీ (7వ ర్యాంకు), పల్లి జలజాక్షి (9వ ర్యాంకు) టాప్-10లో నిలవడం విశేషం. పూర్తి ఫలితాలను jeemain.nta.nic.in వెబ్ సైట్లో చూడొచ్చు.
JEE Main
Results
NTA
India

More Telugu News