ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి నేడే ఘనంగా వీడ్కోలు పార్టీ
- రాజ్యసభలో నేటి సాయంత్రం ఏర్పాటు
- వెంకయ్యనాయుడికి మెమొంటో అందించనున్న ప్రధాని మోదీ
- పదవీకాలం విశేషాలతో కూడిన పుస్తకం ఆవిష్కరణ
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడికి ప్రధాని నరేంద్ర మోదీ ఒక మెమొంటో ప్రదానం చేయనున్నారు. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి పదవీ కాలానికి సంబంధించిన విశేషాలతో ఓ పుస్తకాన్ని కూడా ఇదే కార్యక్రమంలో ప్రధాని ఆవిష్కరించనున్నారు. నేటి రాత్రి ఫేర్ వెల్ డిన్నర్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, ఇతర పార్టీల ముఖ్యులు అందరూ హాజరుకానున్నారు.