Kesineni Nani: కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం... ఆ ట్వీట్లు తనవి కావన్న కేశినేని నాని

Kesineni Nani says those are fake tweets
  • ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు
  • కేశినేని ఎద్దేవా చేసినట్టుగా ట్వీట్లు ప్రచారం
  • అవి ఫేక్ ట్వీట్లన్న కేశినేని నాని
  • సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడి
సోషల్ మీడియాలో టీడీపీ ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం రేగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనను విమర్శిస్తున్నట్టుగా ఆ ట్వీట్లు ఉండడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. సోషల్ మీడియాలో ఈ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. 

దీనిపై కేశినేని నాని స్పందించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ట్వీట్లు తనవి కావని స్పష్టం చేశారు. ఫేక్ ట్వీట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. అటు, ఎంపీ కేశనేని నాని కార్యాలయం అవి ఫేక్ ట్వీట్లు అంటూ స్పష్టం చేసింది. వాటిని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
Kesineni Nani
Fake Tweets
Chandrababu
New Delhi
TDP

More Telugu News