Tollywood: బింబిసార, సీతారామం తొలి రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే!

  • శుక్ర, శనివారాల్లో బింబిసారకు రూ. 17 కోట్ల రాబడి
  • తొలి రోజుతో పోలిస్తే రెండో 17 శాతం తగ్గిన కలెక్షన్స్
  • సీతారామంకు రెండు రోజుల్లో రూ. 10 కోట్లు
 Bimbisara and Sita Ramam two days collections

టాలీవుడ్లో వరుస పరాజయాల తర్వాత తాజాగా విడుదలైన రెండు చిత్రాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. శుక్రవారం విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు విజయం సాధించాయి. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార, మలయాళ  నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషించిన సీతారామం హిట్ టాక్ తో పాటు మంచి వసూళ్లు కూడా సాధించాయి. 

భారతీయ బాక్సాఫీస్ వద్ద బింబిసార తొలి రెండు రోజుల్లో  రూ. 17 కోట్లు రాబట్టింది. శుక్రవారం రూ. 9.25 కోట్లు సాధించిన ఈ చిత్రం శనివారం మాత్రం రూ. 7.75 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించింది. అంటే తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు 17 శాతం తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 శాతం తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ తొలి వారంలో ఈ చిత్రం రూ. 25 కోట్ల వసూళ్లు సాధించే అవకాశం ఉంది. బింబిసార గ్లోబల్ థియేట్రికల్ హక్కులు రూ. 15 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ మొత్తం మూడు రోజుల్లోనే రికవరీ అవుతుంది

మరోవైపు  సీతారామం తొలి రెండు రోజుల్లో రూ. 10 కోట్ల వసూళ్లు రాబట్టింది. శుక్రవారం రూ. 3.80 కోట్లు సాధించిన ఈ చిత్రం శనివారం మాత్రం రూ. 6.20 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఒక్క రోజులోనే కలెక్షన్లలో జంప్ దాదాపు 60 శాతం పెరిగింది.  తెలుగు రాష్ట్రాల వెలుపల కూడా భారీ వృద్ధిని సాధించింది. కేరళలో దాదాపు 80 శాతం వృద్ధి సాధించింది. ఈ చిత్రం వారాంతంలో రూ. 18 కోట్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

More Telugu News