Jai Bhim Bharath Party: ఎంపీ గోరంట్ల మాదిరే ఏపీ మంత్రి ప్రవర్తన... వీడియో విడుద‌ల చేస్తానంటున్న జై భీం భార‌త్ పార్టీ అధ్య‌క్షుడు

Jai Bhim Bharath Party President Advocate Sravan Kumar says ap minister done like mp gorantla madhav
  • మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ ఎంపీ గోరంట్ల‌పై ఆరోప‌ణ‌లు
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన వీడియో
  • ఎంపీ మాదిరే ఓ మంత్రి కూడా వ్య‌వ‌హ‌రించారంటున్న శ్ర‌వ‌ణ్ కుమార్‌
మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న‌ట్లుగా ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో ఏపీలో పెను క‌ల‌క‌ల‌మే రేపుతున్న సంగ‌తి తెలిసిందే. బాధ్య‌త క‌లిగిన ఎంపీ ప‌ద‌విలో ఉండి మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించిన మాధ‌వ్‌ను త‌క్ష‌ణ‌మే ఎంపీ ప‌ద‌వి నుంచి తొల‌గించాలని, వైసీపీ ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయాల‌ని టీడీపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఇలాంటి త‌రుణంలో ఎంపీ గోరంట్ల మాధ‌వ్ మాదిరే వైసీపీకి చెందిన మ‌రో మంత్రి కూడా వ్య‌వ‌హ‌రించార‌ని జై భీం భార‌త్ పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌ముఖ న్యాయ‌వాది శ్ర‌వ‌ణ్ కుమార్ శ‌నివారం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీ మంత్రికి సంబంధించిన స‌ద‌రు వీడియోను త్వ‌ర‌లోనే బ‌య‌ట‌పెడ‌తాన‌ని, సదరు బాధితులు తనను సంప్రదిస్తున్నారనీ శ్ర‌వ‌ణ్ వెల్ల‌డించారు.
Jai Bhim Bharath Party
Sravan Kumar
YSRCP
Gorantla Madhav

More Telugu News