Team India: అమెరికాలో టీమిండియా, వెస్టిండీస్ నాలుగో టీ20 మ్యాచ్ కు వర్షం అడ్డంకి

Rain delays start of Team India and West Indies third T20 in Florida
  • టీమిండియా, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్ ల సిరీస్
  • 2-1తో టీమిండియా ఆధిక్యం
  • నేడు ఫ్లోరిడాలో మ్యాచ్
  • వర్షం కారణంగా టాస్ ఆలస్యం
  • నేటి మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్ కైవసం
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లోని చివరి రెండు మ్యాచ్ లకు అమెరికా ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు, ఐదో టీ20 మ్యాచ్ లకు ఫ్లోరిడా లాడర్ డేల్ లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. 

అయితే, ఇవాళ్టి మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కురవడంతో ఇక్కడి టర్ఫ్ గ్రౌండ్ చిత్తడిగా మారింది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఇంకా టాస్ కూడా వేయలేదు. 

కాగా, ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ను టీమిండియా నెగ్గగా, రెండో మ్యాచ్ ను వెస్టిండీస్ గెలిచి సమం చేసింది. ఆపై మూడో టీ20లో గెలిచిన టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది. నేటి మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ భారత్ వశమవుతుంది.
Team India
West Indies
Florida
Rain
Toss
3rd T20
USA

More Telugu News