Ramreddy Damoder Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లిపోవచ్చు: రాంరెడ్డి దామోదర్ రెడ్డి

Komatireddy Venkat Reddy also may join BJP says Damoder Reddy
  • కోమటిరెడ్డి సోదరులకు కాంగ్రెస్ ఎన్నో అవకాశాలను కల్పించిందన్న దామోదర్ 
  • రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దారుణమని వ్యాఖ్య 
  • కేఏ పాల్, రాజగోపాల్ ఇద్దరూ ఒక్కటేనని ఎద్దేవా 
కోమటిరెడ్డి సోదరులపై టీ.కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాలను కల్పించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంతో లబ్ధి పొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దారుణమని అన్నారు. 

ఏపీలో కేఏ పాల్, తెలంగాణలో రాజగోపాల్ ఇద్దరూ ఒకటేనని... ఏం మాట్లాడతారో వారికే తెలియదని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ ఒకే రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని... వెంకటరెడ్డి తీరును చూస్తుంటే ఆయన కూడా బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చండూరు సభకు హాజరు కాకుండా... అమిత్ షాను కలిసేందుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.
Ramreddy Damoder Reddy
congress
Komatireddy Venkat Reddy
Komatireddy Raj Gopal Reddy
BJP
Amit Shah

More Telugu News