Hyderabad: తుపాకితో బల్లుల్ని కాల్చిన వ్యక్తి.. గురితప్పి బాలుడి వీపులోకి దూసుకెళ్లిన వైనం: పాతబస్తీలో ఘటన

Man fires lizards misfires boy hurt in hyderabad
  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
  • మూడు ఆసుపత్రుల్లో చికిత్స చేయించిన వైనం
  • కోలుకున్న బాలుడు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఎయిర్‌ పిస్టల్‌తో ఇంట్లోని బల్లులను కాలుస్తుండగా ఓ తూటా గోడకు తగిలి అంతే వేగంతో వెనక్కి వచ్చి ఆడుకుంటున్న బాలుడి వీపులోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌ శివారులోని మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సుల్తాన్‌షాహీకి చెందిన మహ్మద్ అబ్దుల్ అప్సర్ (30) ఈ నెల 1న మధ్యాహ్నం ఎయిర్ పిస్టల్‌ను ప్రాక్టీస్ చేస్తూ ఇంట్లోని గోడపై ఉన్న బల్లులను కాల్చ సాగాడు. ఈ క్రమంలో ఓ బుల్లెట్ గోడకు తగిలి దాని ముక్క వరండాలో ఆడుకుంటున్న పక్కింటి బాలుడి (9) వీపులోకి దూసుకెళ్లింది. 

బాలుడికి వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అప్సర్.. అనంతరం చిన్నారిని బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 3న అక్కడి నుంచి బహదూర్‌పురాలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం నిన్న బాలుడు ఇంటికి చేరుకున్నాడు. బాలుడి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Air Pistol
Crime News

More Telugu News