త్వరలోనే తెలుగు బిగ్ బాస్ షో కొత్త సీజన్... ప్రోమో ఇదిగో!
- ఇప్పటిదాకా బిగ్ బాస్ ఐదు సీజన్లు
- త్వరలోనే సీజన్-6 ప్రారంభం
- ఈసారి రెట్టింపు వినోదం ఖాయమన్న స్టార్ మా
తెలుగులో ఇప్పటివరకు బిగ్ బాస్ షో 5 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసింది. ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కూడా ప్రసారమైంది. అయితే అది అన్ని వర్గాలను చేరుకోలేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, బిగ్ బాస్ షో మరోసారి బుల్లితెరపై విజృంభణకు సిద్ధమవుతోంది.