Amitabh Bachchan: పారిస్ లోని ఓ సెలూన్లో అమితాబ్ బచ్చన్ ఫొటోతో ప్రచారం

A hair dressing saloon in France using Amitabh Bachchan photo for campaign
  • భారత నట దిగ్గజంగా అమితాబ్ బచ్చన్
  • అంతర్జాతీయంగానూ గుర్తింపు
  • ఓ హాలీవుడ్ చిత్రంలో ప్రత్యేకపాత్ర
  • పారిస్ లో తన ఫొటోపై అమితాబ్ ఆశ్చర్యం
భారతదేశం గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్. దశాబ్దాలుగా తన నటనా ప్రతిభతో జాతీయస్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన చిత్రాలు అంతర్జాతీయంగానూ ఖ్యాతి పొందాయి. హాలీవుడ్ చిత్రం 'గ్రేట్ గాట్స్ బీ'లోనూ అమితాబ్ ప్రత్యేక పాత్రలో నటించారు. ఆయనకు పలుదేశాల్లో అభిమాన గణం ఉంది. 

కాగా, ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఓ సెలూన్లో అమితాబ్ బచ్చన్ ఫొటోతో ప్రచారం చేసుకుంటుండడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోను అమితాబ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. పారిస్ లోని ఓ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్లో తన ఫొటోను ప్రదర్శిస్తుండగా, ఓ వ్యక్తి కంటబడిందని వెల్లడించారు. దేవుడా... ఇదెక్కడి విడ్డూరం... భలేగుందే! అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
Amitabh Bachchan
Photo
Saloon
Paris
France
Bollywood
India

More Telugu News