Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధూపై కోర్టును ఆశ్రయించిన చిత్ర నిర్మాత

Film producer Upasana Singh files civil suit on Miss Universe Harnaaz Sandhu

  • 2021లో మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న హర్నాజ్
  • బాయ్ జీ కుట్టాంగే అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన వైనం
  • ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదని నిర్మాత ఆరోపణ

గతేడాది మిస్ యూనివర్స్ గా గెలిచి, భారత కీర్తిపతాకను అంతర్జాతీయంగా రెపరెపలాడించిన హర్నాజ్ సంధూ చిక్కుల్లో పడింది. ఆమెపై చిత్ర నిర్మాత ఉపాసన సింగ్ కోర్టులో దావా వేశారు. హర్నాజ్ సంధూ తమ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని, కానీ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరుకాకుండా ఒప్పందానికి తూట్లు పొడిచారని ఉపాసన సింగ్ ఆరోపించారు. ఈ మేరకు చండీగఢ్ జిల్లా కోర్టులో సివిల్ దావా వేశారు. 

ఉపాసన సింగ్ నిర్మించిన 'బాయ్ జీ కుట్టాంగే' అనే చిత్రంలో హర్నాజ్ సంధూ ప్రధానపాత్ర పోషించారు. ఇప్పుడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వివాదం తలెత్తింది. అగ్రిమెంట్ ప్రకారం హర్నాజ్ సంధూ కూడా సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందేనని ఉపాసన సింగ్ అంటున్నారు. కానీ, ప్రమోషన్ కార్యక్రమాలకు డేట్లు ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. 

హర్నాజ్ మిస్ యూనివర్స్ కాకముందే ఆమెకు తమ చిత్రంలో అవకాశం ఇచ్చామని, ఈ సినిమాపై చాలా పెట్టుబడి పెట్టామని, ఇదేమీ చిన్న బడ్జెట్ చిత్రం కాదని నిర్మాత స్పష్టం చేశారు.

Harnaaz Sandhu
Upasana Singh
Civil Suit
Court
Promotions
Miss Universe
  • Loading...

More Telugu News