Kalyanram: కల్యాణ్ రామ్ 'బింబిసార' కు ట్విట్టర్ లో పాజిటివ్ రివ్యూస్..

  • ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బింబిసార'
  • విజువల్ వండర్ అంటూ ట్విట్టర్ రివ్యూలు
  • కల్యాణ్ రామ్ యాక్టింగ్ అదిరిందంటున్న ప్రేక్షకులు
Bimbisara twitter review

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'బింబిసార' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్ లో షోలు ముందే పడిపోయాయి. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలకు సినీ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటించారు. యంగ్ డైరెక్టర్ వశిష్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా... ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. 

సోషల్ ఫాంటసీ మూవీ 'బింబిసార'కు తొలి షో నుంచే హిట్ టాక్ వచ్చింది. సినిమా అదిరింది అంటూ నెటిజన్లు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ నటన ఒక రేంజ్ లో ఉందని అంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చెపుతున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం ఒక విజువల్ వండర్ అని అంటున్నారు.

More Telugu News