Kotamreddy Sridhar Reddy: నెల్లూరులో భారీ వర్షం... నీటిలో ఆగిపోయిన వాహనాలను ముందుకు నెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotam Reddy helps to push vehicles stranded in rain water
  • నెల్లూరులో ఈ ఉదయం నుంచి వర్షం
  • పెళ్లికి వెళ్లేందుకు బయల్దేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
  • మాగుంట లేఅవుట్ వద్ద భారీగా నిలిచిన నీరు
  • అండర్ బ్రిడ్జి వద్ద ఆగిపోయిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఇష్టపడతారు. కాగా, నెల్లూరులో ఇవాళ ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మాగుంట లేఅవుట్ వద్ద అండర్ బ్రిడ్జిలో మోకాలి లోతు నీరు నిలిచింది. అయితే, ఓ పెళ్లికి హాజరయ్యేందుకు అటుగా వెళుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి రోడ్డుపైకి భారీగా నీరు చేరడంతో ఆగిపోయారు. 

అయితే, ఇద్దరు వాహనదారులు నీటిని కూడా లెక్కచేయకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కొంచెం దూరం వెళ్లాక నీరు ఎక్కువగా ఉండడంతో ఆ వాహనాలు నిలిచిపోయాయి. ఎవరూ స్పందించకపోగా, ఎమ్మెల్యే కోటంరెడ్డి మాత్రం వెంటనే రంగంలోకి దిగారు. ఓవైపు వర్షం పడుతున్నా, తన అనుచరులతో కలిసి నీటిలో దిగి ఆ వాహనాలను ముందుకు నెట్టారు. 

ఎమ్మెల్యే ఆ కార్లను నెట్టడం చూసి, అక్కడున్న ఇతరులు కూడా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే కోటంరెడ్డి మాగుంట లేఅవుట్ వద్ద అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిన విషయాన్ని అధికారులకు సమాచారం అందించారు. వెంటనే మోటార్లతో నీటిని తోడివేయాలని స్పష్టం చేశారు.
.
Kotamreddy Sridhar Reddy
Rain
Vehicles
Nellore
YSRCP

More Telugu News