Telangana: తెలంగాణ పోలీస్ క‌మాండ్ కంట్రోల్‌పై కేటీఆర్ స్నిప్పెట్ వీడియో ఇదిగో

ktr posts snippet video on tspiccc in social media
  • క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ను ప్రారంభించిన కేసీఆర్‌
  • నూత‌న భ‌వ‌నంపై ఓ చిన్న వీడియోను విడుద‌ల చేసిన కేటీఆర్‌
  • భ‌వ‌నం, దాని పైభాగం, లోప‌లి వ‌స‌తుల‌ను చూపించిన‌ వీడియో
తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో రాష్ట్ర పోలీసు శాఖ‌కు చెందిన క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ (టీఎస్‌పీఐసీసీసీ)ను గురువారం మ‌ధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. నూత‌నంగా ప్ర‌పంచ శ్రేణి ప్ర‌మాణాల‌తో నిర్మిత‌మైన ఈ భ‌వ‌న స‌ముదాయానికి సంబంధించిన ఫొటోల‌ను బుధ‌వార‌మే మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ను కేసీఆర్ ప్రారంభించ‌డానికి కాస్తంత ముందుగా... నూత‌న భ‌వ‌నం లోప‌ల ఎలా ఉంటుంద‌న్న అంశాన్ని తెలుపుతూ కేటీఆర్ ఓ చిన్న (స్నిప్పెట్‌) వీడియోను విడుద‌ల చేశారు. 1.23 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో క‌మాండ్ కంట్రోల్ భ‌వ‌నం, దాని పై భాగంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌, భ‌వ‌నం లోప‌ల స‌మావేశ మందిరాలు, పోలీసులు నిఘా కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక స‌దుపాయాలు త‌దిత‌రాల‌న్నీ క‌నిపించాయి.
Telangana
TRS
KCR
KTR
TSPICCC
Snippet Video

More Telugu News