TDP: ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్యర్థిని కలిసిన కేశినేని నాని... ప‌క్క‌నే బీజేపీ ఏపీ ఇంచార్జీ సునీల్‌

tdp mp kesineni nai met ndp vice presidential candidate Jagdeep Dhankhar
  • ఢిల్లీలో జగ్ దీప్ ని కలిసిన కేశినేని
  • జగ్ దీప్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ  
  • ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఇంకా ఎవ‌రికీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌ని టీడీపీ
టీడీపీ ఎంపీ కేశినేని నాని బుధ‌వారం ఢిల్లీలో ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థి జగ్ దీప్ ధన్‌ఖడ్‌ ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థి ద్రౌప‌ది ముర్ముకు టీడీపీ మ‌ద్ద‌తిచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌న్న విష‌యంపై టీడీపీ నుంచి ఇప్ప‌టిదాకా ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ఈ నేప‌థ్యంలో ధన్‌ఖడ్‌ ని కేశినేని నాని కలవడం ప్రాధాన్యం సంత‌రించుకుంది. జగ్ దీప్ ధన్‌ఖడ్‌ ని కేశినేని నాని కలిసిన స‌మ‌యంలో బీజేపీ ఏపీ ఇంచార్జీ సునీల్ దేవ్‌ధ‌ర్ అక్క‌డే ఉండ‌టం గ‌మ‌నార్హం.
TDP
Kesineni Nani
BJP
Jagdeep Dhankhar
Vice President Election
Sunil Deodhar

More Telugu News