Telangana: ఉత్తిమాటలు కట్టిపెట్టి.. గట్టి చర్యలు తలపెట్టండి: కేంద్ర మంత్రిపై రేవంత్ సెటైర్‌

tpcc chief revanth reddy satires on union minister gajendra singh shekhawat
  • మంగ‌ళ‌వారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన షెకావ‌త్‌
  • కేసీఆర్ స‌ర్కారు అవినీతిపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన కేంద్ర మంత్రి
  • అవే వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ రేవంత్ రెడ్ది ట్వీట్‌
  • కేసీఆర్‌పై బీజేపీ చ‌ర్య‌లు తీసుకోదంటూ ధ్వ‌జ‌మెత్తిన టీపీసీసీ చీఫ్‌
తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మ‌రోమారు సెటైర్ల వ‌ర్షం కురిపించారు. కేసీఆర్ సర్కారుపై మీరు చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ నిజ‌మేన‌న్న రేవంత్‌... మ‌రి త‌ప్పులు చేసిన కేసీఆర్‌పై చ‌ర్య‌లేవి? అంటూ షెకావ‌త్‌ను నిల‌దీశారు. ఈ మేరకు షెకావ‌త్ వ్యాఖ్య‌ల వార్త క్లిప్పింగ్‌ను కోట్ చేస్తూ కేంద్ర మంత్రిపై రేవంత్ సెటైర్లు సంధించారు. 

షెకావ‌త్ జీ... అంటూ మొద‌లుపెట్టిన రేవంత్ రెడ్డి... కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంలా మారింద‌న్న మీ మాట‌ నిజమేన‌ని తెలిపారు. కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టార‌న్న మీ ఆరోప‌ణా నిజ‌మేన‌న్న రేవంత్‌... కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపంతోనే మునిగిందన్న మీ మాట నిజమేన‌ని తెలిపారు. కేసీఆర్ దోపిడీ, అవినీతి పై మీరు చర్యలు తీసుకోరు… ఇదైతే నికార్సైన నిజమంటూ రేవంత్ ధ్వ‌జ‌మెత్తారు. ఉత్తిమాటలు కట్టిపెట్టి … గట్టి చర్యలు తలపెట్టండి అంటూ కేంద్ర మంత్రిపై రేవంత్ సెటైర్ సంధించారు.
Telangana
TRS
KCR
Kaleswaram Project
Gajendra Singh Shekhawat
Revanth Reddy
TPCC President
BJP
Congress

More Telugu News