'ఖుషీ' ఆ రోజున థియేటర్స్ కి రావడం డౌటే!
- ఊపందుకున్న 'లైగర్' ప్రమోషన్స్
- అందుకు సంబంధించిన పనుల్లో బిజీగా విజయ్ దేవరకొండ
- 'ఖుషీ' విడుదల తేదీపై పడనున్న ప్రభావం
- డిసెంబర్ నుంచి వాయిదా పడే ఛాన్స్ అంటూ టాక్
ఇటీవలే ఈ సినిమాను డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్స్ కి రావడం కష్టమేననే టాక్ బలంగానే వినిపిస్తోంది. అందుకు కారణంగా 'లైగర్' ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది .
'లైగర్' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ, ఆ సినిమా రిలీజ్ అయ్యేవరకూ 'ఖుషీ' షూటింగుకి వెళ్లే అవకాశం లేదు. ఇక ఈ లోగానే షూటింగులు బంద్ కావడం మరో కారణంగా చెబుతున్నారు. బంద్ తరువాత మళ్లీ ఆర్టిస్టుల డేట్స్ దొరకాలి .. దానిని బట్టి షూటింగ్ చేయాలి. అన్ని పనులను పూర్తి చేసుకున్న కారణంగా 'ఏజెంట్' మాత్రం అదే రోజున వస్తున్నాడు.