Prabhas: 'సీతారామం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ప్రభాస్

  • దుల్కర్ సల్మాన్, మృణాల్ జంటగా సీతారామం
  • హను రాఘవపూడి దర్శకత్వంలో చిత్రం
  • రేపు హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుక
  • ప్రభాస్ వస్తున్నాడంటూ చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడి
Prabhas will attend Sitharamam pre release event

పాన్ ఇండియా నటుడు దుల్కర్ సల్మాన్, మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సీతారామం'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు హైదరాబాదులో జరగనుంది. కాగా, ఈ వేడుకకు అగ్రహీరో ప్రభాస్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. 

ఈ మేరకు 'సీతారామం' చిత్ర నిర్మాణ సంస్థ స్వప్న సినిమా వెల్లడించింది. 'మన డార్లింగ్ వస్తున్నాడు' అంటూ ప్రకటించింది. కాగా, 'సీతారామం' చిత్రంలో సుమంత్, రష్మిక మందన కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది.

More Telugu News