పింగళి వెంకయ్యకు నివాళి అర్పించిన జగన్
- జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి నేడు
- క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్
- పింగళి వెంకయ్య దేశ ప్రజలందరూ గర్వించేలా చేశారని వ్యాఖ్య
ఈ సందర్భంగా జగన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య దేశ ప్రజలందరూ గర్వించేలా చేశారని కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.