NTR Trust: వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌ను 'రియ‌ల్ ఆర్ఆర్ఆర్‌'గా అభివ‌ర్ణించిన టీడీపీ నేత‌

tdp leader mannava mohana krishna meets ysrcp rebel mp raghurama krishna raju
  • టీడీపీ కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్న మ‌న్న‌వ‌
  • సోమ‌వారం ర‌ఘురామ‌రాజుతో భేటీ
  • ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకున్న ఎన్టీఆర్ ట్ర‌స్ట్ డైరెక్ట‌ర్‌
 ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజును 'రియ‌ల్ ఆర్ఆర్ఆర్‌'గా అభివ‌ర్ణిస్తూ టీడీపీకి చెందిన కీల‌క నేత ఒక‌రు సోమ‌వారం ట్వీట్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్న మ‌న్న‌వ మోహ‌న కృష్ణ సోమ‌వారం ర‌ఘురామ‌రాజుతో భేటీ అయ్యారు. 

ఈ సంద‌ర్భంగా వైసీపీ రెబ‌ల్ ఎంపీతో ఆయ‌న ఫొటోలు దిగారు. ఈ ఫొటోల‌ను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగానే ర‌ఘురామ‌ను రియల్ ఆర్ఆర్ఆర్‌గా అభివ‌ర్ణించారు. టీడీపీ రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌దర్శిగా కొన‌సాగుతున్న మ‌న్న‌వ‌... పార్టీ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ఎన్టీఆర్ ట్ర‌స్ట్‌లో డైరెక్ట‌ర్‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఉత్త‌ర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్‌)కి గ‌తంలో ఆయ‌న ప్రెసిడెంట్‌గానూ ప‌ని చేశారు.
NTR Trust
NATS
TDP
Raghu Rama Krishna Raju
YSRCP
Mannava Mohan Krishna

More Telugu News