Nara Lokesh: "చిన్నమ్మ"... అంటూ నారా లోకేశ్ ఆవేదనాభరిత స్పందన

Lokesh gets emotional after his aunt Uma Maheswari sudden demise
  • ఎన్టీఆర్ కుమార్తె హఠాన్మరణం
  • నందమూరి, నారా కుటుంబాల్లో విషాదం
  • తీవ్ర దిగ్భ్రాంతికి గురైన నారా లోకేశ్
  • తమ కుటుంబానికి కోలుకోలేని విషాదం అని వెల్లడి
నందమూరి తారక రామారావు చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మృతి నందమూరి, నారా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. దీనిపై నారా లోకేశ్ స్పందించారు. చిన్నమ్మ కంఠమనేని ఉమామహేశ్వరి గారు ఇక లేరన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఆమె మరణ సమాచారం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. 

కుటుంబంలో ఏ శుభకార్యమైనా చిన్నమ్మ ఎంతో పెద్దమనసుతో దగ్గరుండి జరిపించేవారని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. మార్గదర్శిగా నిలిచిన చిన్నమ్మ మృతి తమ కుటుంబానికి కోలుకోలేని విషాదం అని పేర్కొన్నారు. చిన్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Nara Lokesh
Kantamaneni Uma Maheswari
Demise
Nandamuri
Nara

More Telugu News