Guntur-Tirupati: గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు ఆగస్టు 18న పునఃప్రారంభం

  • కరోనా సమయంలో నిలిచిన పలు రైళ్లు
  • క్రమంగా రైళ్ల పునరుద్ధరణ
  • 7 జిల్లాల మీదుగా గుంటూరు-తిరుపతి రైలు పయనం
  • రైల్వేమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ బీజేపీ నేతలు
Guntur to Tirupati express will revive on August 18th

కరోనా సంక్షోభ సమయంలో రైల్వే శాఖ అనేక రైళ్లను నిలిపివేసింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు శాంతించడంతో క్రమంగా రైళ్లను పునరుద్ధరిస్తోంది. తాజాగా, గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలును పునఃప్రారంభిస్తోంది. ఆగస్టు 18 నుంచి ఈ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు తీయనుంది. గుంటూరులో సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 

ఈ రైలు నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. కాగా, గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలును పునరుద్ధరించడంపై ఏపీ బీజేపీ నేతలు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News