NTR: అమెరికా నుంచి బ‌య‌లుదేరిన కూతురు, అల్లుడు... ఎల్లుండి ఉమామ‌హేశ్వ‌రి అంత్య‌క్రియ‌లు

uma maheswari elder daughter starts from america and funeral on day after tomorrow
  • ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామ‌హేశ్వ‌రి
  • ఉస్మానియాలో మృత దేహానికి పోస్టుమార్టం పూర్తి
  • అమెరికా నుంచి బ‌య‌లుదేరిన ఉమామ‌హేశ్వ‌రి పెద్ద కుమార్తె
టీడీపీ వ్య‌వ‌స్థాపకుడు, దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు చిన్న కుమార్తె కంఠ‌మ‌నేని ఉమామ‌హేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఉమామ‌హేశ్వ‌రి చిన్న కూతురు దీక్షిత ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆమె మృత దేహానికి ఉస్మానియా ఆసుప‌త్రిలో శ‌వ ప‌రీక్ష నిర్వ‌హించారు. అనంతరం ఉమామ‌హేశ్వ‌రి మృతదేహాన్ని ఆమె ఇంటికి త‌ర‌లించారు. 

ఇదిలా ఉంటే... ఉమామ‌హేశ్వ‌రి పెద్ద కుమార్తె త‌న భ‌ర్త‌తో క‌లిసి అమెరికాలో ఉంటున్నారు. త‌ల్లి మ‌ర‌ణ వార్త తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే ఆమె త‌న భ‌ర్త‌తో క‌లిసి హైద‌రాబాద్ బ‌య‌లుదేరారు. ఈ క్ర‌మంలో పెద్ద కుమార్తె వ‌చ్చాకే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని ఆమె కుటుంబం నిర్ణ‌యించింది.  దీంతో ఎల్లుండి ఉమా మ‌హేశ్వ‌రి అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించాల‌ని ఆమె కుటుంబం నిర్ణ‌యించింది.
NTR
TDP
Uma Maheswari
Hyderabad

More Telugu News