'ప్రొఫెసర్ విశ్వామిత్ర'గా మోహన్ బాబు!

  • నిరాశ పరిచిన 'సన్నాఫ్ ఇండియా'
  • 'అగ్ని నక్షత్రం'తో రంగంలోకి మోహన్ బాబు 
  • నిర్మాతగా లక్ష్మీప్రసన్న
  • దర్శకుడిగా ప్రతీక్ ప్రజోష్ పరిచయం  
మోహన్ బాబు హీరోగా ఆ మధ్య చేసిన 'సన్నాఫ్ ఇండియా' ఆయనతో పాటు ఆయన అభిమానులను కూడా పూర్తిగా నిరాశపరిచింది. ఆ సినిమా చాలా తక్కువ వసూళ్లను రాబట్టడం వలన, ఇక ఇప్పట్లో మోహన్ బాబు సినిమా చేయకపోవచ్చని చాలామంది అనుకున్నారు. కానీ మోహన్ బాబు మరో సినిమాతో రెడీ అవుతూనే ఉన్నారు.

మోహన్ బాబు ప్రధానమైన పాత్రధారిగా ఆయన కూతురు లక్ష్మీప్రసన్న 'అగ్ని నక్షత్రం' అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాలో మోహన్ బాబు 'ప్రొఫెసర్ విశ్వామిత్ర' అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో .. నడివయసు దాటిన పాత్రలో ఆయన కనిపిస్తున్నారు. ఈ తరహా పాత్రను పోషించడం ఇదే ఫస్టు టైమ్ అని మోహన్ బాబు చెప్పడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రతీక్ ప్రజోష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలోనే మిగతా విషయాలు  తెలియనున్నాయి.


More Telugu News

Mohan Babu lakshmi Prasanna Agni Naksharam Movie