KJ Sarathi: సీనియర్ కమెడియన్ సారథి కన్నుమూత

Tollywood senior comedian KJ Sarathi passes away
  • కొంత కాలంగా కిడ్నీ, లంగ్స్ సమస్యలతో బాధపడుతున్న సారథి
  • ఆయన వయసు 83 సంవత్సరాలు
  • 350కి పైగా సినిమాల్లో నటించడమే కాక.. పలు చిత్రాలను నిర్మించిన సారథి
తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు వరుసగా కన్నుమూస్తుండటం ఇండస్ట్రీని విషాదంలో ముంచేస్తోంది. తాజాగా ఇండస్ట్రీలో మరోసారి విషాదం నెలకొంది. ఎన్నో చిత్రాలలో తన అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు కేజే సారథి ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ, లంగ్స్ సమస్యలతో బాధపడుతున్నారు. నెల రోజుల నుంచి హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి రాత్రి 2.32 గంటలకు ఆయన మృతి చెందారు. 

కేజే సారథి 1942 జూన్ 26న పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండలో జన్మించారు. ఆయన పూర్తి పేరు కడలి విజయ సారథి. ఆయన 350కి పైగా చిత్రాలలో నటించారు. అంతేకాదు నిర్మాతగా మారి కృష్ణంరాజుతో 'ధర్మాత్ముడు', 'విధాత', 'శ్రీరామచంద్రుడు', 'అగ్గిరాజు' చిత్రాలను నిర్మించారు. కేజే సారథి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
KJ Sarathi
Tollywood
Dead

More Telugu News