Shamshabad: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. టీపీసీసీ నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె మృతి

Nampally congress leader Feroz Khan daughter Talia Died in an road accident
  • విమానాశ్రయం నుంచి వస్తుండగా బోల్తాపడిన కారు
  • అక్కడికక్కడే మృతి చెందిన తానియా
  • తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు
  • పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు మృతదేహం  
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ పరిధిలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన కాంగ్రెస్ నేత కుమార్తె మృతి చెందింది. విమానాశ్రయం నుంచి వస్తున్న సమయంలో శాతంరాయి వద్ద కారు బోల్తాపడింది. ఈ ఘటనలో తెలంగాణ  పీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్యనేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ కుమార్తె తానియా (25) ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తానియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Shamshabad
Mohammed Feroz Khan
TPCC
Congress

More Telugu News