అనంతపురంలో రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ
- క్రిమినల్ కేసుల దర్యాప్తులో ఫోరెన్సిక్ ఫలితాలే కీలకమన్న వనిత
- ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవుతోందని వెల్లడి
- పోలీసులు క్షణాల్లో స్పందిస్తున్నారని వివరణ
- లోన్ యాప్ ఆగడాలను సీఎం దృష్టికి తీసుకెళతానని వెల్లడి
అటు, లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలపైనా హోంమంత్రి స్పందించారు. లోన్ యాప్ ల వేధింపుల వ్యవహారాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని తెలిపారు. రుణాలు తీసుకున్నవారి మొబైల్ డేటా సాయంతో వేధింపులకు పాల్పడడం నేరం అని స్పష్టం చేశారు. వేధింపులకు పాల్పడే లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.