సమంత వ్యవహారంలో ఇక చెప్పాల్సిందేమీ లేదు: నాగచైతన్య

Naga Chaitanya opines on Samantha issue
  • విడిపోయిన సమంత, నాగచైతన్య
  • ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్న చై-సామ్
  • జాతీయ మీడియాతో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ నటులు నాగచైతన్య, సమంత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికి చాలాకాలం కావస్తున్నా, ఇప్పటికీ వారిద్దరి వ్యవహారం చర్చనీయాంశంగానే ఉంది. ఇదే అంశంపై సమంత ఇటీవల కాఫీ విత్ కరణ్ లోనూ ప్రస్తావించింది. తమ గతం గురించి సమంత ఎలాంటి సంకోచాలు లేకుండా మాట్లాడుతుండగా, నాగచైతన్య చాలావరకు మౌనంగానే ఉంటున్నారు. అయితే, ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తన వ్యక్తిగత జీవితం గురించి అందరూ మాట్లాడుకోవడం చాలా అసహనం కలిగిస్తోందని పేర్కొన్నారు. తాను ఇక్కడ ఓ నటుడ్ని అని, తన నటనా జీవితం గురించే అందరూ మాట్లాడుకోవాలని కోరుకుంటానని స్పష్టం చేశారు. అంతేతప్ప, తన వ్యక్తిగత జీవితం గురించి చర్చించుకోవడాన్ని ఏమాత్రం ఇష్టపడనని తెలిపారు. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందని, 'పర్సనల్' అని ఎందుకు అంటామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. 

"నా సినీ జీవితం కంటే వ్యక్తిగత జీవితమే పెద్ద హెడ్ లైన్ గా మారిపోతోంది. సినీ రంగంలో నేను సాధించిన వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఇది చాలా చికాకు కలిగించే అంశం. దురదృష్టం ఏమిటంటే సినిమా రంగంలో వ్యక్తిగత జీవితం కూడా వార్తావస్తువే అవుతుంది" అని వివరించారు. 

తమ వైవాహిక జీవితం ముగించడానికి గల కారణాలు ఏమని చెప్పాలనుకున్నామో వాటిని ఓ ప్రకటన రూపంలో సంయుక్తంగా చెప్పేశామని నాగచైతన్య స్పష్టం చేశారు. ఇప్పుడు సమంత దారి సమంతదే... నా దారి నాదే... ఇంతకుమించి ఈ విషయంలో చెప్పాల్సిందేమీ లేదు అని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Naga Chaitanya
Samantha
Marital Life
Tollywood

More Telugu News