Janasena: ఆగ‌స్టు 1న ఖ‌మ్మం జిల్లాలో నాగ‌బాబు ప‌ర్య‌ట‌న‌

janasena pac member nagababu tour in khammam district on august 1
  • జిల్లాలోని స‌త్తుప‌ల్లి, అశ్వారావుపేటల్లో నాగ‌బాబు ప‌ర్య‌ట‌న‌
  • స‌త్తుప‌ల్లిలో పార్టీ క్రియాశీల కార్య‌క‌ర్త‌కు బీమా చెక్కును అందించ‌నున్న వైనం
  • అశ్వారావుపేట‌లో పార్టీ జెండాల‌ను ఆవిష్క‌రించ‌నున్న పీఏసీ స‌భ్యుడు
జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) స‌భ్యుడు నాగ‌బాబు వ‌చ్చే నెల (ఆగ‌స్టు) 1న తెలంగాణ‌లోని ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న జిల్లాలో స‌త్తుప‌ల్లి, అశ్వారావు పేట‌ల్లో ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఈ మేర‌కు జ‌న‌సేన శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లికి చెందిన జ‌న‌సేన క్రియాశీల కార్య‌క‌ర్త ఒక‌రు రోడ్డు ప్ర‌మాదానికి గురి కాగా... త‌న ప‌ర్య‌ట‌న‌లో బాధితుడి కుటుంబానికి నాగ‌బాబు ప్ర‌మాద బీమాకు సంబంధించిన చెక్కును అంద‌జేయ‌నున్నారు. అనంత‌రం అశ్వారావుపేట వెళ్ల‌నున్న నాగ‌బాబు... అక్క‌డ స్థానిక నేత‌లు, జ‌న‌సైనికులు ఏర్పాటు చేసిన పార్టీ జెండాల‌ను ఆవిష్క‌రించ‌నున్నారు.
Janasena
Nagababu
Khammam District
Telangana

More Telugu News