Kalyanram: పేరు మార్చుకున్న తరువాతనే కలిసొచ్చింది: 'బింబిసార' డైరెక్టర్

Vashishta Interview
  • కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న 'బింబిసార'
  • దర్శకత్వం వహించిన వశిష్ఠ
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతణ్ణి వేణు అంటూ పిలిచిన ఎన్టీఆర్ 
  • ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన వశిష్ఠ  
కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన 'బింబిసార' ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన 'బింబిసార' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతను తనకి 'వేణు'గా మాత్రమే తెలుసునని ఎన్టీఆర్ అన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి వశిష్ఠ ప్రస్తావించాడు. 

"వేణు అనేది నా అసలు పేరు కాదు .. పెట్ నేమ్. నా అసలు పేరు వచ్చి వెంకటనారాయణ రెడ్డి. ఫ్రెండ్స్ అంతా కూడా వేణు అని పిలుస్తుండేవారు. ఒక రోజున మా అక్కయ్య 'అరేయ్ ఎందుకో నీ పేరు మారిస్తే బాగుంటుందని అనిపిస్తుందిరా' అంది. అలా అయితే మార్చేయ్ అన్నాను. తనే నాకు వశిష్ఠ అనే పేరు పెట్టింది. 

నా ఫేస్ బుక్ ను .. ట్విట్టర్ అకౌంట్ ను ఆ పేరు మీదికి మార్చుకున్నాను. అలా మార్చుకున్న వారం రోజుల్లోనే కల్యాణ్ గారిని కలవడం .. ఆయనకి కథ చెప్పడం .. ఓకే అవ్వడం జరిగిపోయాయి. ఇదేదో బాగుందని చెప్పేసి ఫాలో అవుతున్నాను. అలా వేణు కాస్తా వశిష్ఠగా మారిపోయాడు" అంటూ చెప్పుకొచ్చాడు.
Kalyanram
Vashishta
Bimbisara Movie

More Telugu News