: 'కోర్టులంటే గౌరవముంది కానీ సీబీఐ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోంది'

చట్టమన్నా, కోర్టులన్నా తమకు చాలా గౌరవముందని, కానీ దర్యాప్తు పేరిట సీబీఐ పూర్తిగా రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి వ్వవహరిస్తోందని ఎంవీ మైసూరా రెడ్డి సీబీఐ తీరుపై ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముక్కలు ముక్కలుగా ఛార్జిషీటు వేయడమనేది చట్టాన్ని దుర్వినియోగం చెయ్యడమేనని, ఏ నిబంధనల ప్రకారం ఇలా వ్యవహరిస్తున్నారో తెలపాలని డిమాండ్ చేసారు. జగన్ ను జైలులో నుంచి రానీయకుండా కాంగ్రెస్, టీడీపీ లు ప్రచారం చేసుకునేందుకు సీబీఐతో కలిసి కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. తాము చేపట్టిన కార్యక్రమాలు కోర్టులకు వ్యతిరేకంగా కాదని, సీబీఐ తీరుని ఎండగడూతూ మాత్రమే అని మైసూరా తెలిపారు.

More Telugu News