Custodial Death: లాక‌ప్ డెత్‌లు త‌గ్గిన రాష్ట్రాల జాబితాలో టాప్‌లో ఏపీ... జాబితా బ‌య‌ట‌పెట్టిన‌ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

  • 2020-21లో ఏపీలో 50 లాక‌ప్ డెత్‌లు
  • 2021-22లో 48కి త‌గ్గిన క‌స్టోడియ‌ల్ డెత్‌లు
  • జాబితా విడుద‌ల చేసిన కేంద్ర ప్ర‌భుత్వం
  • జాబితాను పోస్ట్ చేసిన విజ‌య‌సాయిరెడ్డి
ap tops in custodial deaths decreasing stetes list

లాక‌ప్ డెత్ (క‌స్టోడియ‌ల్ డెత్‌)ల త‌గ్గుద‌ల‌లో దేశంలోనే ఆంధ్ర ప్ర‌దేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఈ విష‌యాన్ని వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. లాక‌ప్ డెత్‌ల‌కు సంబంధించి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప‌రిస్థితిని వివ‌రిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జాబితాల‌ను సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. 

ఈ జాబితాలో 2020-21 ఏడాదిలో ఏపీలో 50 లాక‌ప్ డెత్‌లు చోటుచేసుకోగా...2021-22కు అది 48కి త‌గ్గింది. అంటే ఏడాదిలోనే 2 లాకప్ డెత్‌లు త‌గ్గిన‌ట్లు లెక్క‌. ఇలా ఇంకొన్ని రాష్ట్రాల్లోనూ లాక‌ప్ డెత్‌లు త‌గ్గినా... వాటి త‌గ్గుద‌ల శాతంలో మాత్రం ఏపీ మొద‌టి స్థానంలో నిలిచింది. మరిన్ని రాష్ట్రాల్లోనూ లాక‌ప్ డెత్‌లు త‌గ్గాయ‌ని పేర్కొన్న సాయిరెడ్డి... ఇది ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామ‌మ‌ని తెలిపారు. ఏపీ సీఎం జ‌గ‌న్ నాయ‌కత్వంలో లాకప్ డెత్‌ల‌ను మ‌రింత త‌గ్గించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న వెల్లడించారు.

More Telugu News