Chess pieces: చదరంగంలో పావులు ప్రాణంతో వస్తే..! ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో

Chess pieces come alive Industrialist Anand Mahindra hails superb video
  • చదరంగం బోర్డుపై మనుషులే పావులుగా మారి చేసిన నృత్యం
  • పుదుక్కొట్టాయ్ జిల్లా యంత్రాంగం రూపకల్పన
  • సజీవ రూపాలతో కళ్లకు కట్టారన్న ఆనంద్ మహీంద్రా
చదరంగం బోర్డుపై పావులతో ఎత్తుకు పైఎత్తులు వేయడం, గెలుపు సాధించడం మంచి మజానిస్తుంది. ప్లాస్టిక్ లేదా చెక్క బోర్డుపై పావులతో చెస్ ఆడడం గురించి తెలుసు. కానీ, పావుల స్థానంలో మనుషులే పాత్రధారులైతే ఎలా ఉంటుందో ఓ సారి గుర్తు చేసుకోండి..? దీన్నే ఆచరణలో చూపించారు. తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కొట్టాయ్ కలెక్టర్ కవితా రాము స్వయంగా కొరియో గ్రఫీతో ఈ వీడియోకు ప్రాణం పోశారు. దీన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ పేజీ ద్వారా ఇతరులకు పరిచయం చేశారు. 

‘‘అద్భుతం. పుదుక్కొట్టాయ్ కలెక్టర్ కవితారాము కొరియోగ్రఫీ చేసినట్టు నాకు చెప్పారు. చదరంగంలో పావులు సజీవంగా వస్తే ఎలా ఉంటుందో మన కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇది ప్రామాణికతను కలిగి ఉంది. మన దేశంలో కనుగొనబడిన గేమ్ ఇది’’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఈ వీడియోను పుదుక్కొట్టాయ్ జిల్లా యంత్రాంగం రూపొందించింది. ఈ అందమైన డ్యాన్స్ వీడియోను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా మెచ్చుకున్నారు. జిల్లా అధికార యంత్రాంగం చెస్ ఒలింపియాడ్ 2022ను ప్రచారం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుందని ప్రశంసించారు.
Chess pieces
Anand Mahindra
superb video
Pudukkottai

More Telugu News