Sajjala Ramakrishna Reddy: చంద్రబాబును ప్రజలు చెత్త బుట్టలో పడేశారు: సజ్జల రామకృష్ణారెడ్డి

People rejected Chandrababu says Sajjala Ramakrishna Reddy
  • చంద్రబాబు చరిత్ర హీనుడన్న సజ్జల 
  • పోలవరం, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్న 
  • పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ పై జగన్ ప్రకటన చేశారని వెల్లడి 
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చరిత్ర హీనుడని ఆయన అన్నారు. చంద్రబాబును ప్రజలు చెత్త బుట్టలో పడేశారని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు రాజీనామా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 

ఒక పక్కా ప్రణాళికతో పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ పై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేశారని... కేంద్రం నుంచి నిధులు రావడం ఆలస్యమైనా 41.5 అడుగుల వరకు ఆర్ అండ్ ఆర్ తాను ఇస్తానని చెప్పారని అన్నారు. 45.5 అడుగుల వరకు పూర్తిగా నీటిని నింపాలంటే రెండేళ్ల సమయం పడుతుందని... ఆ లోగానే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పారు. ఆర్ అండ్ ఆర్ ఇవ్వకుండా నీటిని నింపితేనో, ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తేనో రాద్ధాంతం చేయాలని అన్నారు.
Sajjala Ramakrishna Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Polavaram Project

More Telugu News