KTR: మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు హాజరుకాలేదంటూ ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు ఇచ్చారు: సునీల్ దేవధర్

Sunil Deodhar says three employees got memo for not attending KTR birthday celebrations
  • ఈ నెల 24న కేటీఆర్ పుట్టినరోజు
  • బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రిలో వేడుకలు
  • ముగ్గురు ఉద్యోగులు గైర్హాజరు!
  • మెమో జారీ చేసిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్
ఈ నెల 24న తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు ఆ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి. కాగా, బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన కేటీఆర్ పుట్టినరోజు సంబరాలకు ముగ్గురు ఉద్యోగులు హాజరుకాలేదంటూ వారికి నోటీసులు జారీ చేసిన విషయాన్ని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

కేసీఆర్ కుటుంబం పెంచిపోషిస్తున్న రాచరికపు పోకడలు తెలంగాణలో మరో స్థాయికి చేరాయని విమర్శించారు. ఈ నెల 24న జరిగిన కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు ఎందుకు హాజరుకాలేదంటూ తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిందని సునీల్ దేవధర్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని తెలిపారు. అంతేకాదు, సదరు ఉద్యోగులకు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన మెమోను కూడా సునీల్ దేవధర్ పంచుకున్నారు. 
KTR
Birthday
Celebrations
Employees
Bellampally Municipality
Memo

More Telugu News