Asus Zenfone: ఒక్క చేతిలోనే ఒదిగిపోయే ఆసుస్ జెన్ ఫోన్ 9

Asus Zenfone 9 with compact display two rear cameras launched
  • కొత్త డిజైన్ తో విడుదలైన ఆసుస్ ఫోన్
  • స్నాప్ డ్రాగన్ కొత్త చిప్ సెట్ ఏర్పాటు
  • ప్రపంచవ్యాప్తంగా పలు మార్కెట్లలో విడుదల
  • భారత్ లో విడుదలపై లేని సమాచారం
ఆసుస్ జెన్ ఫోన్ 9 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను అంతర్జాతీయంగా కొన్ని మార్కెట్లలోకి విడుదల చేసింది. నూతన డిజైన్ తో దీన్ని తీసుకొచ్చింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్ సెట్ తో ఇది పనిచేస్తుంది. జెన్ ఫోన్ 8 జెడ్ మాదిరే 5.9 అంగుళాల స్క్రీన్ తో ఉంటుంది. 120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది. వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉంటాయి. అందులో మెయిన్ కెమెరా  50 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో 12 మెగాపిక్సల్ సోనీ కెమెరా ఏర్పాటు చేశారు.  

8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో మూడు రకాల వేరియంట్లు ఉన్నాయి. ఇందులో బేస్ మోడల్ ధరను 800 యూరోలుగా నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో రూ.65,000. భారత్ లో ఎప్పుడు ఈ ఫోన్ ను విడుదల చేస్తుందన్న సమాచారం లేదు. అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
Asus Zenfone
launched
premium phone

More Telugu News