PV Sindhu: బర్మింగ్‌హామ్ చేరుకున్న సింధుకు కొవిడ్ సోకినట్టు అనుమానం.. రెండోసారి పరీక్షలో నెగటివ్

  Covid scare for PV Sindhu upon arrival in Birmingham
  • ఆర్టీపీసీఆర్ టెస్టులో పీవీ సింధుకు అనుమాన ఫలితం
  • పర్యవేక్షణలో ఉంచిన అధికారులు
  • క్రీడా గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరణ
  • రెండోసారి నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
కామన్వెల్త్ క్రీడల కోసం బర్మింగ్‌హామ్‌లో అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్ జట్టులో కరోనా కలకలం రేగింది. ఆటగాళ్లు బర్మింగ్‌హామ్ చేరుకోగానే నిబంధనల ప్రకారం ఆటగాళ్లకు ఆర్టీపీసీఆర్ టెస్టు నిర్వహించారు. మిగతావారందరికీ నెగటివ్ రాగా, పీవీ సింధు ఫలితం మాత్రం కాస్త అటూఇటూగా వచ్చింది. ఫలితం అనుమానంగా ఉండడంతో రెండో టెస్టు ఫలితం వచ్చే వరకు ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సింధుకు సూచించారు. 

ఆమెను పర్యవేక్షణలో ఉంచినట్టు భారత అధికారులు కూడా తెలిపారు. అయితే, రెండోసారి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో సింధుకు నెగటివ్ రావడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. సింధుకు కొవిడ్ సోకలేదని నిర్ధారణ అయ్యాక ఆమెను కామన్వెల్త్ క్రీడా గ్రామంలోకి అనుమతించారు.
PV Sindhu
Birmingham
COVID19

More Telugu News