తెలంగాణలో మరింత పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు... వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 38,122 కరోనా పరీక్షలు
- 836 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 443 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 765 మంది
- ఇంకా 4,986 మందికి చికిత్స
అదే సమయంలో 765 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేమీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,17,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,08,270 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,986 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.
