Ramcharan: జేమ్స్ బాండ్ గా రామ్ చరణ్ సరిపోతాడన్న అమెరికా టీవీ సిరీస్ మేకర్

US TV Series maker says Ram Charan can justify as James Bond
  • ఇటీవల ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ కు వరల్డ్ వైడ్ క్రేజ్
  • ఆర్ఆర్ఆర్ లో ఆకట్టుకున్నాడన్న చియో హోడారి కోకర్
  • బాండ్ పిస్టల్ పట్టుకునే అర్హత ఉందని కితాబు
అమెరికా టీవీ సిరీస్ మేకర్ చియో హోడారి కోకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ఫేమస్ అయిన జేమ్స్ బాండ్ పాత్రకు ఇప్పుడున్న ప్రపంచ నటుల్లో ఎవరు సరిపోతారన్న ప్రశ్నకు ఆయన రామ్ చరణ్ పేరు చెప్పారు. ఇటీవల కాలంలో పియర్స్ బ్రాస్నన్ తర్వాత డేనియల్ క్రెగ్ జేమ్స్ బాండ్ గా నటిస్తున్నారు.

కాగా, క్రెగ్ తరహాలో బాండ్ పాత్రకు న్యాయం చేసే పలువురి నటుల పేర్లను కోకర్ వెల్లడించారు. వారిలో రామ్ చరణ్ పేరు కూడా ఉండడం విశేషం. ఇద్రిస్ ఎల్బా, సోప్ దిరిసు, మాథ్యూ గూడే, డామ్సన్ ఇద్రిస్, రామ్ చరణ్ అంటూ ఓ జాబితాను పేర్కొన్నారు. ఆయా నటులు తనను ఏ చిత్రాల్లో ఆకట్టుకున్నారో కూడా కోకర్ వివరించారు. 

ఇద్రిస్ ఎల్బా గురించి అందరికీ తెలిసిందేనని, 'గాంగ్స్ ఆఫ్ లండన్' లో సోప్ నటన భేషుగ్గా ఉందని, 'ది ఆఫర్' చిత్రంలో మాథ్యూ గూడే అద్భుతంగా నటించాడని తెలిపారు. 'స్నోఫాల్' చిత్రంలో డామ్సన్ ఆకట్టుకోగా, 'ఆర్ఆర్ఆర్' లో రామ్ (రామ్ చరణ్) మెరుగైన నటన కనబర్చాడని కితాబిచ్చారు. వీరందరికీ జేమ్స్ బాండ్ ధరించే సవిల్లే రో సూట్ ధరించడానికి, వాల్తర్ పీపీకే పిస్టల్ పట్టుకోవడానికి అర్హత ఉందని కోకర్ వివరించారు.
Ramcharan
James Bond
Cheo Kokar
Hollywood
Tollywood

More Telugu News