Moto X30 Pro: ప్రపంచంలో తొలి 200 మెగాపిక్సెల్ ఫోన్.. మోటో ఎక్స్ 30 ప్రో ఫోన్ ప్రత్యేకతలు ఇవిగో!

The worlds first 200 megapixel phone Moto X30 Pro Here the  specifications
  • కంపెనీ నుంచి సేకరించిన వివరాలతో టెక్ సంస్థల అంచనాలు
  • వెనుకవైపు 200 ఎంపీతోపాటు 50 ఎంపీ, 12 ఎంపీ త్రిపుల్ కెమెరా.. 60 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఎన్నో సదుపాయాలు
ప్రపంచంలో తొలి 200 మెగాపిక్సెల్ కెమెరాతో మోటో ఎక్స్ 30 ప్రో స్మార్ట్ ఫోన్ త్వరలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన పలు ప్రత్యేకతలు తాజాగా బయటికి వచ్చాయి. మోటోరోలా సంస్థ ఆగస్టు 2న ఈ ఫోన్ ను తొలుత చైనాలో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అందులో అత్యంత భారీగా 200 మెగాపిక్సెల్ కెమెరాను పొందుపరుస్తున్నట్టు ఇటీవలే నిర్ధారించింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను ఇంకా వెల్లడించలేదు. అయితే కంపెనీ వర్గాలు, టెక్నాలజీ సంస్థల నుంచి అందిన సమాచారం ప్రకారం పీసీ మ్యాగ్, మరికొన్ని టెక్నాలజీ వెబ్ సైట్లు ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ కు సంబంధించిన వివరాలను వెల్లడించాయి. ఆ వివరాల మేరకు మోటో ఎక్స్ 30 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఇవీ..

  • మోటో ఎక్స్ 30 ప్రో ఫోన్ 6.67 అంగుళాల భారీ ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉండనుంది. దీనికి హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ ఉంటుంది. స్క్రీన్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో ఉండటంతో.. గేమ్స్ ఆడేవారికి మంచి అనుభూతి లభిస్తుంది.
  • 200 మెగాపిక్సెల్ కెమెరాతోపాటు 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ కెమెరాల ఉండనున్నాయి. 85 ఎంఎం, 50 ఎంఎం, 35 ఎంఎం లెన్స్, సెన్సర్ల సాయంతో క్లోజప్, పోర్ట్రయిట్, వైడ్ యాంగిల్ ఫొటోలు తీసుకునే సదుపాయం ఉండనుంది.
  • ఇక ఏకంగా 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • అత్యంత అధునాతనమైన స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 1 ప్రాసెసర్ (3.2 గిగాహెర్డ్జ్ వేగంతో కూడిన ఆక్టాకోర్ ప్రాసెసర్), ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో ఫోన్ నడుస్తుంది.
  • 5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ, ఏకంగా 125 వాట్ల అధునాతన ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంటాయి. కేవలం అరగంటలోనే బ్యాటరీ దాదాపుగా ఫుల్ అవుతుంది.
  • వైర్ లెస్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంటుందని అంచనా.
  • ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ ముందు, వెనుక భాగాల్లో కాకుండా.. వ్యాల్యూమ్, పవర్ బటన్ల తరహాలో పక్క భాగంలో ఉంటుంది.
  • 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ మెమరీతో ఒక మోడల్, 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీతో మరో మోడల్ అందుబాటులో ఉండనున్నాయి.
  • 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ మోడల్ ధర సుమారు రూ.59,990 ఉంటుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలీజ్ రోజున మోటో సంస్థ ధరను ప్రకటించే అవకాశం ఉంది.

Moto X30 Pro
Motorola
Phone
Smart Phone
China
Tech-News
Offbeat

More Telugu News