Kollywood: ఉదయనిధి స్టాలిన్ హీరోగా సినిమా నిర్మిస్తున్న కమల​హాసన్​

Udhayanidhi Stalin will play the lead in Kamal Haasans next production
  • ఉదయనిధి ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు పూర్తి
  • గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయనిధి
  • సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు మూడు నెలల కిందట ప్రకటన
  • మనసు మార్చుకొని కొత్త సినిమాకు ఓకే చెప్పిన ఉదయనిధి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు, ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అవుతోంది. సరిగ్గా పదేళ్ల క్రితం ‘ఓకే ఓకే’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఉదయనిధి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్టు ఈ మధ్యే ప్రకటించారు. ఇకపై పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కానీ, మూడు నెలలు తిరిగే లోపే మనసు మార్చుకున్నారు. తాజాగా ఆయన ఒక చిత్రం ఒప్పుకున్నారు. అది కూడా విలక్షణ నటుడు కమలహాసన్‌ నిర్మాణంలో ఆయన హీరోగా నటించబోతున్నారు. 

కమలహాసన్ హీరోగా ఆయన సొంత బ్యానర్‌‌ అయిన రాజ్‌ కమల్ ఇంటర్నేషనల్‌ నిర్మించిన ‘విక్రమ్‌’ సినిమా బ్లాక్‌ బస్టర్ సాధించింది. ఉదయనిధికి చెందిన రెడ్ జాయింట్ మూవీస్‌ సంస్థ ఈ సినిమాని తమిళంలో పంపిణీ చేసింది. సంస్థను ప్రారంభించి పదమూడేళ్లయిన సందర్భంగా ఇటీవల ఓ వేడుక నిర్వహించారు. ఇదే వేదికపై తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్‌‌లో ఉదయనిధి హీరోగా సినిమాని నిర్మించనున్నట్టు కమల్ ప్రకటించారు. మహేశ్ నారాయణ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. హీరోగా తనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చారంటూ కమలహాసన్‌కు ఉదయనిధి కృతజ్ఞతలు తెలిపారు.
Kollywood
udhayanidhi stalin
Kamal Haasan
new movie
mla
Tamilnadu

More Telugu News