Paytm Mal: పేటీఎం మాల్ లో దొంగలు పడ్డారు.. 34 లక్షల మంది డేటా లీక్

  • 2020 హ్యాకింగ్ సమయంలోనే లీకేజీ అంటూ వార్తలు
  • యూజర్ల మొబైల్ నంబర్, ఇతర సమాచారం లీక్
  • నిజం కాదంటూ ఖండించిన పేటీఎం మాల్
Personal data of 3 million Paytm Mall users reportedly exposed in 2020 data breach

పేటీఎం సంస్థకు చెందిన ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ పేటీఎం మాల్ కు చెందిన వినియోగదారుల విలువైన డేటా లీక్ అయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 2020లో పేటీఎం మాల్ హ్యాకింగ్ కు గురైన సమయంలోనే ఇది జరిగినట్టు తెలుస్తోంది. ఇలా 34 లక్షల మందికి సంబంధించిన మొబైల్ నంబర్స్, ఇతర వ్యక్తిగత సమాచారం (డేటా) చోరీకి గురైనట్టు సమాచారం. తమ డేటా లీక్ అయిందీ, లేనిదీ తెలుసుకునేందుకు ఫైర్ ఫాక్స్ మానిటర్ ఓ లింక్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 

మరోపక్క, డేటా లీకేజీ వార్తలను పీటీఎం మాల్ అప్పట్లోనే ఖండించింది. తాజాగా కూడా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ‘‘మా యూజర్ల డేటా పూర్తి సురక్షితంగా ఉంది. 2020లో డేటా లీక్ అయినట్టు వస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పు, అసంబద్ధమైనవి’’ అని పేటీఎం మాల్ ప్రకటించింది.

More Telugu News